గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 14:31:59

ఈ ఎమోజీని ఎక్కువ ‌సేపు చూస్తే ఒత్తిడికి గురవుతార‌ట‌!

ఈ ఎమోజీని ఎక్కువ ‌సేపు చూస్తే ఒత్తిడికి గురవుతార‌ట‌!

హాయ్‌! బాయ్‌.. ఆనందం, ఆశ్చ‌ర్యం ఇలా ఏం తెలియ‌జేయాల‌న్నా టెక్ట్స్‌ క‌న్నా ఫోన్‌‌లో ఎమోజీల‌నే ఎక్కువ‌గా వాడుతున్నారు. ప్ర‌తి ఏడాది ఎమోజీ డే రోజు కొత్త ఎమోజీల‌ను రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఎమోజీను ఎక్కువ‌గా చూడ‌డం వ‌ల్ల డిప్రెష‌న్‌కు గుర‌వుతుంటార‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. టీనేజ‌ర్స్ ఎక్కువ‌గా వాడే విచారం ఎమోజీ వ‌ల్ల‌నే ఒత్తిడికి గుర‌వుతున్నార‌ట‌.   

రిసెర్చ‌ర్స్ ఎమోష‌న్ స్టిమ్యులైకి ఎలాంటి రియాక్ష‌న్స్ ఉంటాయి. ఏఏ స్టిములైకి ఎక్కువ‌సేపు ఎటెన్ష‌న్ పెట్టార‌నీ కొంత‌మంది టీనేజ‌ర్లతో ఐ ట్రాకింగ్ ద్వారా స్టడీ చేశారు. బాధ‌గా ఉండే బొమ్మ‌ల‌ను చూసే వారికి డిప్రెష‌న్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిసింది. ఒక టీనేజ‌ర్ ఎమోష‌న్‌కి గురైన‌ప్పుడు స్ట్రాంగ్‌గా రెస్పాండ్ అయేందుకు బ్రెయిన్ స‌రిగ్గా కంట్రోల్ చేయ‌లేక‌పోతే నెగ‌టివ్ స్టిమ్యులై నుంచి పక్కకి చూడలేరు అని పరిశోధకులు తెలుపుతున్నారు.


logo