సోమవారం 25 జనవరి 2021
National - Nov 29, 2020 , 16:32:44

మద్యం ఆరోగ్యానికి హానికరం కాదా...?

 మద్యం ఆరోగ్యానికి హానికరం కాదా...?

హైదరాబాద్ :ప్రతి మద్యం బాటిల్ పై మద్యం ఆరోగ్యానికి హానికరం అని ముద్రించి ఉంటుంది. ఎవరైనా మద్యం సేవిస్తే.. ఆరోగ్యం పాడవుతుందని అంటారు. ఇదేంటంటనే సందేహం రావచ్చు. ఏధైనా అమితంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా మితంగా తింటేనే మంచిదని పెద్దలు చెబుతుంటారు. అదేవిధంగా మితంగా మద్యం సేవిస్తే.. చాలా ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇక మితంగా మద్యం సేవించడంతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామ్...

మితంగా మద్యం సేవిస్తే మంచిదని సలహా ఇస్తుంటారు. ఇక మితంగా రోజుకు ఓ పెగ్ మందు పుచ్చుకునే వాళ్ళు ఎక్కువగా గ్రీన్ టీ  తాగితే మంచిదని  వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ "టీ"లో పలురకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల.. అవి లివర్‌ను ఆరోగ్యకరంగా ఉంచుతాయట. మరోవైపు మద్యం సేవించే వాళ్లకు ఎప్పుడూ జీర్ణాశయంలో మంట ఉంటుంది. ఇది తగ్గడానికి రోజుకు ఓ ఆపిల్‌ను తింటే.. అందులో ఉండే పెక్టిన్ అనే కెమికల్ మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిని ఫాలో అవుతూ   మందు తీసుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుందట. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo