శనివారం 11 జూలై 2020
National - Jun 15, 2020 , 07:13:03

కరోనా భయంతో ఐఆర్‌ఎస్‌ అధికారి ఆత్మహత్య

కరోనా భయంతో ఐఆర్‌ఎస్‌ అధికారి ఆత్మహత్య

న్యూఢిల్లీ: తన వల్ల కుటుంబ సభ్యులు కూడా కరోనా వైరస్‌ బారిన పడతారనే భయంతో ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ సంఘటన న్యూఢిల్లీలోని ద్వారకా జిల్లాలో చోటుచేసుకున్నది. కరోనా భయంతో 56 ఏండ్ల ఐఆర్‌ఎస్‌ అధికారి తన కారులో యాసిడ్‌ లాంటి పదార్థం తాగి ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారులో విగత జీవిగా పడిఉన్న అతన్ని గుర్తించిన పోలీసులు సమీపంలోని దవాఖానకు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ప్రకటించారు. 

తనకు కరోనా సోకిందనే భయంతో, తన వల్ల కుటుంబ సభ్యులకు ఈ ప్రాణాంతక వైరస్‌ సోకకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. కాగా ఆ అధికారికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. యాసిడ్‌ లాంటి పదార్థం తాగడంతోనే ఐఆర్‌ఎస్‌ అధికారి మరణించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో, తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో అతడు కలత చెందాడని, తన వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.


logo