శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 27, 2020 , 00:00:00

కరోనా పాలసీలకు ఐఆర్దీఏఐ గ్రీన్ సిగ్నల్

కరోనా పాలసీలకు ఐఆర్దీఏఐ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాధి ఖర్చులు భరించేందుకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ (ఐ ఆర్దీఏఐ)29 బీమా కంపెనీలకు స్వల్పకాలిక కరోనా కవచ్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా చికిత్స ఖర్చు ఎక్కువ అవుతున్నది. ఈ నేపథ్యంలో బీమా సంస్థలు కరోనా బీమా పాలసీలను అందిస్తున్నాయి . ఐఆర్దీఏఐ గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో స్వల్పకాలిక కరోనా కవచ్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీని 29 జనరల్, ఆరోగ్య బీమా సంస్థలు శుక్రవారం ప్రారంభించాయి. కరోనా పాలసీలను తీసుకు రావాల్సిన అవసరం ఉందని భావించిన రెగ్యులేటర్ ఇందుకు అనుగుణంగా రెండు బీమా పాలసీలను రూపొందించి నిబంధనలు విడుదల చేసింది. "ఆరోగ్య కవచ్", "కరోనా రక్షక్" పేర్లతో పాలసీలను తీసుకు రావాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్, మ్యాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా, భారతీ, ఓరియంటల్, బజాజ్, స్టార్ సహా 29 సంస్థలు పాలసీలతో ముందుకు వచ్చాయి.



logo