శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 13:35:55

ఐఆర్‌డీఏ కీలక నిర్ణయం...తగ్గనున్న వాహనాల ధరలు

ఐఆర్‌డీఏ కీలక నిర్ణయం...తగ్గనున్న వాహనాల ధరలు

ముంబై: కారు లేదా బైక్ కొనాలనుకునేవారికి శుభవార్త...ఆగష్టు 1 నుంచి బైక్ , కార్ ధరలు తగ్గనున్నాయి. మరో మూడు రోజులు తర్వాత కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. కారు కొనుగోలు సమయంలో చెల్లించే ఇన్ష్యూరెన్స్ పే మెంట్ ఇప్పుడు ఒక ఏడాది వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఇన్యూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ( ఐ ఆర్దీ ఏ )తెలిపింది. దీర్ఘకాలిక ఇన్ష్యూరెన్స్ ప్యాకేజీలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నది. దీర్ఘకాలిక ఇన్ష్యూరెన్స్ ప్యాకేజీ తీసుకోవాలని కస్టమర్ భావించినప్పటికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ఆప్షన్‌ను ఐఆర్‌డీఏ తొలగించింది .

అయితే కొత్త వాహన కొనుగోలుదారులు మాత్రం ఒక ఏడాది పాటు డ్యామేజ్ పాలసీకి సంబంధించి సమగ్ర బీమాకోసం చెల్లించాలని అదే సమయంలో థర్డ్ పార్టీ బీమా కారుకు అయితే మూడేండ్ల , ద్విచక్రవాహనానికి ఐదేండ్లు తప్పని సరి అని పేర్కొన్నది. ఇలాంటి కష్ట సమయంలో కొనుగోళ్ల విషయంలో స్వల్ప ఊరట కూడా లబ్ధి చేకూర్చినట్లే అవుతుందని పలువురు ఆటోమోటివ్స్ యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి. బీమా రెన్యువల్, ఇతరత్ర విషయాలపై ఈ సమయంలో కస్టమర్లు ఇబ్బంది పడతారని కానీ తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లయ్యిందని వెల్లడించారు. ఒక ఏడాది తర్వాత ఇన్ష్యూరెన్స్ కంపెనీని మార్చాలనుకుంటే అది పెద్ద సవాలుగా మారేదని ఎందుకంటే ఐదేండ్లు ఒకే ఇన్ష్యూరెన్స్ సంస్థలో లాక్‌ ఇన్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు నూతన విధానంతో అలాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

ఆటో ఇండస్ట్రీ సేల్స్ గణనీయంగా పడిపోతున్న సమయంలో ఐఆర్‌డీఏ ఊరటనిచ్చే వార్తను ఇచ్చింది. సెప్టెంబర్ 2018 నుంచి వాహన సేల్స్ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అదేసమయంలో తప్పనిసరిగా ఇన్ష్యూరెన్స్ ఐదేండ్లు తీసుకోవాలని ఐఆర్‌డీఏ చెప్పడంతో సేల్స్ మరింత పడిపోయాయి. 2019లో వాహన అమ్మకాలు మరింత క్షీణించాయి. దీంతో ఆటో మొబైల్ ఇండస్ట్రీ అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. అయితే 2020లో BS6 నిబంధనలు అమలు చేస్తుండటంతో వాహనాల అమ్మకాలు పుంజుకుంటాయని అంతా భావించిన నేపథ్యంలో కరోనావైరస్ మహమ్మారి ఆ ఆశలపై నీళ్లు చల్లింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆటో ఇండస్ట్రీ ఆశలు కొంత మేర చిగురించే అవకాశం ఉన్నది. 


logo