బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 02:00:20

త్వరలో మళ్లీ పట్టాలపైకి ‘స్వర్ణ రథం’

త్వరలో మళ్లీ పట్టాలపైకి ‘స్వర్ణ రథం’

న్యూఢిల్లీ: విలాసవంత రైలు ‘గోల్డెన్‌ ఛారియట్‌ (స్వర్ణ రథం)’ సేవలను మార్చి 22 నుంచి పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. 2008లో కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ  ఈ రైలును ప్రారంభించింది. కొన్నేం డ్ల అనంతరం నిలిపేసిన ఈ రైలును ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఒప్పందం కుదిరింది. ‘కర్ణాటక ఆత్మగౌరవం’ పేరుతో మార్చి 22, 29, ఏప్రిల్‌ 12న వారం రోజుల రైలు యాత్రలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ విలాస రైలులో ఆధునాతన ఫర్నీచర్‌, స్పా, జిమ్‌, వైఫైతో కూడిన స్మార్ట్‌ టీవీలు వంటి ప్రత్యేక హంగులతోపాటు నోరూరించే స్వదేశీ, విదేశీ వంటకాలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.


logo
>>>>>>