ఆదివారం 05 జూలై 2020
National - Jun 23, 2020 , 21:24:10

రైలు టికెట్ల రద్దు మొత్తాలను ఇలా తిరిగి పొందండి

రైలు టికెట్ల రద్దు మొత్తాలను ఇలా తిరిగి పొందండి

ముంబై : బుక్ చేసిన రైలు టికెట్‌ మొత్తాన్ని తిరిగి పొందడానికి భారత రైల్వే శాఖ నిబంధనలను మార్చింది. ఏప్రిల్ 14 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న అన్ని సాధారణ రైలు టిక్కెట్లను తిరిగి చెల్లించాలని భారత రైల్వే నిర్ణయించింది. 2020 ఏప్రిల్ 12న లేదా రాబోయే 120 రోజుల రైళ్ల కోసం టికెట్లను బుక్ చేసుకుంటే.. ఆ రైలు రద్దు చేయబడితే, టిఆర్సీ పూర్తి మొత్తాన్ని ఐఆర్సీటీసి తిరిగి చెల్లిస్తుంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు, ఇతరులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఐఆర్‌సీటీసీ 230 స్పెషల్ రైళ్లను నడుపుతున్నది. కొవిడ్ -19 దృష్ట్యా ఏప్రిల్ 15 నుంచి సాధారణ రైళ్ల రిజర్వేషన్లను ముందుగానే నిలిపివేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా అన్ని రైళ్లు మార్చి 25 నుంచి నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వారిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు మే 12 నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లను నడిపింది. ప్రారంభంలో 30 రాజధాని వంటి ఎయిర్ కండిషన్డ్ రైళ్లు ప్రారంభించారు. తరువాత జూన్ 1 నుంచి 200 ఏసీ స్లీపర్ రైలు సర్వీసులు ఉన్నాయి.

టికెట్ వాపసు ప్రక్రియ:

పీఆర్ఎస్ కౌంటర్:

- పీఆర్ఎస్ కౌంటర్ నుంచి టికెట్లు తీసుకున్న ప్రయాణికులు ప్రయాణ తేదీ నుంచి 6 నెలల వరకు ఎప్పుడైనా కౌంటర్ నుంచి డబ్బు వాపసు తీసుకోవచ్చు.

- ఈ-టికెట్ వాపసు ఆటోమేటిక్‌గా చేయబడుతుంది.

- రైలు రద్దు చేయకపోతే, ఇంకా ప్రయాణీకుడు ప్రయాణించకూడదనుకుంటే.. ఆ రిజర్వ్ టికెట్ యొక్క పూర్తి మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇది పీఆర్ఎస్, ఈ-టికెట్ రెండింటికీ వర్తిస్తుంది.

పీఆర్ఎస్ కౌంటర్ టికెట్: 

ప్రయాణీకులు టికెట్ డిపాజిట్ రశీదును చూపించడం ద్వారా ప్రయాణ తేదీ నుంచి వచ్చే 6 నెలల వరకు పూర్తి వాపసు తీసుకోవచ్చు.

ఈ-టికెట్:

రద్దు ప్రక్రియ, ఈ-టికెట్ల కోసం వాపసు సౌకర్యం అందుబాటులో ఉన్నది.

ఇప్పటికే టిక్కెట్లు పొందిన వారు ..

పీఆర్ఎస్ కౌంటర్ టికెట్:

మార్చి 21 తర్వాత టికెట్లు రద్దు చేసుకొన్న ప్రయాణికులు రద్దు ఛార్జీ వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత జోనల్ రైల్వే ప్రధాన కార్యాలయంలో ప్రయాణ తేదీ నిర్ణయించిన 6 నెలల్లోపు  చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ- టికెట్లతో:

రద్దు ఛార్జీకి తగ్గించిన మొత్తాన్ని టికెట్ బుక్ చేసుకొన్న ప్రయాణికుల ఖాతాలో జమ చేయబడుతుంది.


logo