సోమవారం 30 మార్చి 2020
National - Feb 11, 2020 , 07:17:10

మాజీ భార్య ఇంటి ముందు ఎస్పీ మౌన పోరాటం!

మాజీ భార్య ఇంటి ముందు ఎస్పీ మౌన పోరాటం!
  • పిల్లలను కలుసుకోనివ్వడం లేదంటూ నిరసన.. కర్ణాటకలో ఘటన

బెంగళూరు: మాజీ భార్య ఇంటి ఎదుట ఓ పోలీస్‌ అధికారి మౌన పోరాటం చేశాడు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికులు, మీడియా దృష్టిని ఆకట్టుకున్నది. కలుబురగిలో అంతర్గత భద్రతా విభాగంలో ఎస్పీగా పని చేస్తున్న అరుణ్‌ రంగరాజన్‌ ఆదివారం మాజీ భార్య ఇంటికి వచ్చాడు. తన పిల్లలను ఆమె కలవనీయడం లేదని ఆరోపిస్తూ ఇంటి ముందు బైఠాయించాడు. దీంతో స్థానికులు, మీడియా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌ అధికారిణి, హోంగార్డ్స్‌ డిప్యూటీ కమాండెంట్‌ జనరల్‌ లాక్కియా కరుణగారన్‌, మాజీ భర్త ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులకు సీనియర్‌ అధికారి రంగరాజన్‌తో ఎలా వ్యవహరించాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో స్పందించిన రంగరాజన్‌ తమది ప్రేమ వివాహమని చెప్పారు. చివరకు తన ఇద్దరు పిల్లలను కలుసుకున్న రంగరాజన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
logo