శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 20:40:47

హెల్మెట్ల బీఐఎస్ ధ్రువీకరణ అమలుపై ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం

 హెల్మెట్ల బీఐఎస్ ధ్రువీకరణ అమలుపై ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం

ఢిల్లీ : ద్విచక్ర వాహన చోద‌కుల రక్షణ కోసం మెరుగైన‌ హెల్మెట్లను తీసుకురావడానికి కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఆర్‌టీహెచ్) ఒక‌ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ (బీఐఎస్‌) 2016, ప్రకారం హెల్మెట్లకు బీఐఎస్‌ ధ్రువీకరణ విధానాన్ని అమ‌లుల్లోకి తేవాలి స‌ర్కారు యోచిస్తున్నది. దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

దీనివ‌ల్ల భారత దేశంలో ద్విచక్ర వాహన చోద‌కుల‌కు బీఐఎస్ సర్టిఫికేట్ క‌లిగి ఉన్నహెల్మెట్లను మాత్రమే తయారు చేసి విక్రయించడానికి వీల‌వుతుంది. ఫ‌లితంగా ద్విచక్ర వాహన హెల్మెట్ల నాణ్యతను మెరుగ‌వుతుంది. ద్విచక్ర వాహనాల ప్రమాదాలను తగ్గించడంలో దోహ‌దపడుతుంది . ఈ విషయంలో సూచనలు లేదా వ్యాఖ్యలను నోటిఫికేష‌న్ జారీ అయిన తేదీ నుంచి ముప్పై రోజులలోపు జాయింట్ సెక్రటరీ (ఎంవిఎల్), రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ, రవాణా భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ-110001 (ఇమెయిల్: [email protected]) పంపవచ్చు. 


logo