శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 05, 2020 , 16:06:05

గ్యాంగ్‌స్టర్‌ దూబేకు సహకరించింది పోలీసులే

గ్యాంగ్‌స్టర్‌ దూబేకు సహకరించింది పోలీసులే

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులపై కాల్పులు జరిపి హతమార్చిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేకు సహకరించిన పోలీసులపై దర్యాప్తు జరుపుతున్నట్లు కన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేస్తున్నట్లు స్థానిక పోలీసుల నుంచి వికాస్‌కు సమాచారం అందిందని ఆయన చెప్పారు. దీంతో తన అనుచరులను పెద్ద సంఖ్యలో రప్పించి పోలీసులపై కాల్పులు జరిపాడని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో వికాస్ దూబేకు ఫోన్ చేసి సమాచారం అందించిన పోలీసులు ఎవరన్నది  దర్యాప్తు చేస్తున్నట్లు మోహిత్ తెలిపారు. దోషులుగా తేలిన పోలీసులపై హత్య కేసు నమోదు చేస్తామన్నారు.
వికాస్ దూబేను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు శనివారం రాత్రి అరెస్టైన అతడి అనుచరుడు దయా శంకర్ అగ్నిహోత్రి పోలీసులకు చెప్పాడు. దీంతో వికాస్ దూబేకు పోలీసులు సహకరించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్‌కు సహకరించిన పోలీసులను విడిచిపెట్టబోమని, దర్యాప్తు చేసి వారు ఎవరన్నదని తెలుసుకుని కఠినంగా వ్యవహరిస్తామని కన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ హెచ్చరించారు.logo