మంగళవారం 31 మార్చి 2020
National - Feb 12, 2020 , 12:47:03

పాఠశాలల్లో హనుమాన్‌ చాలీసా చదివించండి..

పాఠశాలల్లో హనుమాన్‌ చాలీసా చదివించండి..

న్యూఢిల్లీ : ఢిల్లీ విద్యాసంస్థల్లో హనుమాన్‌ చాలీసా పఠించేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జనరల్‌ సెక్రటరీ కైలాష్‌ విజయ్‌వర్గీయ ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు సూచించారు. ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు కైలాష్‌ విజయ్‌వర్గీయ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. హనుమంతుడి ఆశీస్సులతో గెలుపొందిన మీరు.. ఢిల్లీలోని అన్ని విద్యాసంస్థల్లో హనుమాన్‌ చాలీసా పఠించేలా చర్యలు తీసుకోవాలని విజయ్‌ వర్గీయ.. కేజ్రీవాల్‌ను కోరారు. హనుమాన్‌ చాలీసాను మదర్సాల్లో కూడా అమలు చేయాలన్నారు. భజరంగ్‌భళీ ఆశీస్సులు ఢిల్లీ విద్యార్థులకు ఎందుకు ఉండొద్దని బీజేపీ నాయకుడు ప్రశ్నించారు. హనుమంతుడి, ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించానని ఎన్నికల ఫలితాల అనంతరం కేజ్రీవాల్‌ వెల్లడించిన విషయం విదితమే. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్‌ 62 స్థానాల్లో విజయం సాధించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 


logo
>>>>>>