గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 20:07:31

స‌ర్వేలో బ‌య‌ట ప‌డిన విష‌యం.. పెద్ద‌ల ప్ర‌మేయం లేకుండానే భాగ‌స్వామి ఎంపిక‌!

స‌ర్వేలో బ‌య‌ట ప‌డిన విష‌యం.. పెద్ద‌ల ప్ర‌మేయం లేకుండానే భాగ‌స్వామి ఎంపిక‌!

ఈరోజుల్లో అరేంజ్డ్ మ్యారేజ్ క‌న్నా ల‌వ్ మ్యారేజ్‌ల‌కే ఎక్క‌వ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. లేదంటే పెద్ద‌లు చూడ‌కుండా అబ్బాయిలు, అమ్మాయిలు ఆన్‌లైన్‌, షాదీ.కామ్‌, మ్యాట్రిమోనీ వంటి వెబ్‌సైట్ల ద్వారా స‌రైన భాగ‌స్వామిని ఎంచుకుంటున్నారు. ఓ మ్యాట్రిమోని సంస్థ చేసిన తాజా అధ్యయనం ద్వారా మ‌రికొన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సుమారు ఆరు ల‌క్ష‌ల మంది యువ‌తీ యువ‌కుల‌ను ప్ర‌శ్నించి అధ్యయ‌నం చేశారు. 

* దాదాపు 60 శాతం మంది యువత పెద్దల ప్రమేయం లేకుండానే తమకు నచ్చిన వారిని ఎంచుకోవాలని భావిస్తున్నారు. 

* 76 శాతం మంది మ్యాట్రిమోనీ సంస్థ‌ల‌ను ఆశ్ర‌యించ‌కుండానే వెబ్‌సైట్ యాప్‌ల ద్వారా రిజిస్ట‌ర్ అవుతున్నారు. 26 శాతం మంది అబ్బాయిలు ఇత‌ర రాష్ట్రాల అమ్మాయిలు అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నారు.

* 23 శాతం మంది త‌మ ప్రాంతం వారే అయితే మ‌రింత బాగుంటుంద‌ని అనుకుంటున్నారు. 67 శాతం అమ్మాయిలు. 64 శాతం అబ్బాయిలు త‌మ జీవిత భాగ‌స్వామి దేశంలోని ఎక్క‌డైన ప‌ర్వాలేదనుకుంటున్నారు. 

* అన్నిటిక‌న్నా ముఖ్యంగా హైద‌రాబాద్‌, గుంటూర్‌, విజ‌య‌వాడ‌, తూర్పు గోదావ‌రి,  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన యువ‌త‌ర‌మే ఎక్కువ‌గా మ్యాట్రిమోనీల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. 

* 23 నుంచి 27 ఏండ్ల మ‌ధ్య ఉన్న అమ్మాయిలు ఉద్యోగం చేస్తూనే వివాహం కోసం ఆన్‌లైన్ మాధ్య‌మాల‌ను సంప్ర‌దిస్తున్నారు.     

* కులంతో ప‌నిలేకుండా ఎవ‌రైనా ప‌ర్వాలేద‌ని చెప్పేవాల‌ల్లో 8 శాతం అమ్మాయిలు, 10 శాతం అబ్బాయిలు ఉన్నారు. సైట్‌ను సంప్ర‌దించే వారిలో 42 శాతం ఇంజినీరింగ్ చ‌దివిన అమ్మాయిలు ఉండ‌గా, 36 శాతం ఇంజినీరింగ్ చ‌దివిన అబ్బాయిలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. 

 


logo