శనివారం 28 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 19:24:09

కుప్వారాలో ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిపివేత‌

కుప్వారాలో ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిపివేత‌

శ్రీన‌గ‌ర్‌: జమ్ముక‌శ్మీర్‌లోని కుప్వారాలో ఇంటర్నెట్ సేవ‌ల‌ను అధికారులు నిలిపేశారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న‌, ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉన్న‌ది. ఇలాంటి స‌మ‌యంలో ఇంట‌ర్నెట్ సంబంధాలు ఉంటే శ‌త్రువులు దుర్మార్గాల‌కు ఒడిగ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ది. అందుకే ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా కుప్వారాలో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపేసినట్లు అధికారులు వెల్ల‌డించారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఇంటర్నెట్ తిరిగి ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.