శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 10:22:31

అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ : ప్రధాని మోదీ

అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ మోడీ వెల్లడించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై మాట్లాడారు. ఇంటర్నెట్ విప్లవాన్ని అన్ని గ్రామాలకు తీసుకు వెళ్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. 2014 నాటికి దేశంలో  కేవలం ఐదు డజన్ల పంచాయతీలకే అంతర్జాల సౌకర్యం ఉండేదని, ఆరేళ్లలో ఆరున్నర లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందని, ఆరు లక్షల గ్రామాలకు వేల కిలోమీటర్లు ఆఫ్టికల్‌ ఫైబర్‌ను తీసుకెళ్తున్నామన్నారు. వచ్చే వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికి ఆఫ్టికల్‌ ఫైబర్‌ విస్తరించనున్నట్లు ప్రకటించారు. పెరుగుతున్న అవసరాలతో పాటు సైబర్‌ రంగంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని అన్నారు. సైబర్‌ నేరాల కట్టడికి నూతన ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. త్వరలో కొత్తగా సైబర్‌ సెక్యూరిటీ విధానం తీసుకురానున్నట్లు ప్రధాని ప్రకటించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo