శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 00:14:20

మహిళా సిబ్బందితో రైళ్లు, విమాన సర్వీసుల నిర్వహణ

మహిళా సిబ్బందితో రైళ్లు, విమాన సర్వీసుల నిర్వహణ

న్యూఢిల్లీ/ కోయంబత్తూర్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం కొన్ని రూట్లలో రైళ్లు, విమాన సర్వీసులను  పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన మహిళా సిబ్బంది ఆదివారం ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో రూట్‌తోపాటు 8 అంతర్జాతీయ, 44 దేశీయ రూట్లలో విజయవంతంగా విమానాలను నడిపారు. మరోవైపు తమిళనాడులోని కోయంబత్తూర్‌-కేఎస్‌ఆర్‌ బెంగళూరు మధ్య నడిచే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోయంబత్తూర్‌ నుంచి ఆదివారం ఉదయం 5.40 గంటలకు బయలుదేరింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో సిబ్బంది అంతా మహిళలే.


logo