శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 16:13:31

గృహ హింస వల్ల వారే కాదు... అందరూ ఇబ్బంది పడుతున్నారు....

గృహ హింస వల్ల వారే కాదు... అందరూ ఇబ్బంది పడుతున్నారు....

నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా...ప్రత్యేక కథనం 

హైదరాబాద్ : భాగస్వామి నుంచి ఎన్ని రకాల హింసలు అంటే అత్తింటి వారితో బాధ, నిరంతర హింస, నపుంసకత్వం,అనుమానం. విడాకులు తీసుకొని విడిగా ఉన్నా వెంటాడడం. శారీరకంగా దాడి చేయడం.లైంగిక హింస, ఉద్రేక(ఎమోషనల్) హింస, మానసిక వేధింపులు, మాటల ద్వారా హింసించడం, ఆర్థిక హింస, డబ్బు కోసం ఒత్తిడి చేయడం, పిల్లలను అడ్డుపెట్టుకొని హింసించడం,  అక్రమ సంబంధాలు,  ఇలా చెప్పుకుంటూ పోతే   మహిళలు ఎన్నో రకాల హింసలు అనుభవిస్తున్నారు. పరువు, ప్రతిష్ఠ కోసం, భవిష్యత్తులో అండదండ ఉండదనే ఉద్దేశంతో, పిల్లల కోసం, వాళ్ల చదువులు పెండ్లిళ్ల  కోసం, కుటుంబ గౌరవం కోసం, బయటకు రాలేక  ఇండ్లలోనే అతివలెంతోమంది మగ్గిపోతున్నారు.

గృహ హింస,  కష్టాలూ, కన్నీళ్లు అనగానే అవన్నీ మహిళకే సొంతం అనుకోవడం సహజం. కానీ, ప్రతి పదిమంది పురుషుల్లో ఒకరు గృహ హింస బారిన పడుతున్నట్టు తమ బాధల్ని మనసులో దాచుకొని, గృహహింసను అనుభవిస్తున్నారు. ఇంట్లో భార్యామణుల చేత చిత్రహింసలకు గురౌతున్న భర్తలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోవడానికి సామాజికంగా తన హోదా తగ్గుతుందన్న భావనే కారణమని అధ్యయనవేత్త రాబర్ట్ జే. రీడ్ పేర్కొన్నారు. వయసు 55 దాటిన వారి కన్నా యువకులు రెట్టింపు శాతం ఇంటియాతనకు గురౌతున్నారు.

ఎక్కువ వయసు గల పురుషులు తాము అనుభవించే గృహ హింసనుప్రస్తావించడానికి కూడా వారు విముఖత ప్రదర్శించారు. మహిళలు కూడా తమ భర్తలను కొట్టడం, దూషించడం, సూటిపోటి మాటలనడాన్ని గృహహింసగా అధ్యయనం నిర్వచించింది. భార్య వల్ల ఇంటిపోరు లేనివారి కన్నా హింస పడే వారు మూడు రెట్లు మానసిక వత్తిడికి గురౌతున్నారు. కానీ, శ్రీమతి తిట్టినా, కొట్టినా ఆమెతోనే ఉండాలని భార్యాబాధితుల్లో ఎక్కువ మంది భావించడం విశేషం. ఈ మధ్యకాలంలో  తాప్సి “Thappad “  (చెంప దెబ్బ) అనే హిందీ సినిమా వచ్చింది .దానిలోభర్త కోపంగా ఉన్నప్పుడు భార్యను ఒక చెంపదెబ్బ కొట్టడం సహజమే అని సమాజం నుంచి... చెంపదెబ్బఎందుకు కొట్టాలి అనే ప్రశ్నే ఈ సినిమా... చూసేవాళ్ళకి ఇది చాలా చిన్న విషయం...  కుటుంబం కోసం, భర్తకోసం, సమాజం కోసం సర్దుకుపోవాలి  అని చాలామంది ఆలోచించారు…. 

కానీ అదే సినిమాలో మనకి కరెక్ట్ గా ఆలోచిస్తే సమాధానం కూడా  తెలుస్తుంది..  భర్త క్యారెక్టర్  తాను  ఇష్టపడి,  కష్టపడి చేస్తున్న ఉద్యోగంలో తనకు గుర్తింపు లేదు అన్నప్పుడు ఉద్యోగం వదిలేయడానికి నిర్ణయించుకున్నాడు.   అదే  భార్య ఎంతో ఇష్టంతో  భర్తకు,  అత్తగారికి  ఎన్నో సేవలు చేస్తూ ఉంటే అందరి ముందు చెంపదెబ్బ కొట్టడం సహజమే, సర్దుకుపోవాలి అనేదాన్ని  భార్య క్యారెక్టర్ ఒప్పుకోకపోవడ మే సినిమా.. కొట్టడం హక్కు కాదు గృహ హింస అనేది చట్టం. ఎవరిని ఎవరు కొట్టే హక్కు, హింసించే హక్కు లేదు. సమాజంలో ప్రతి ఒక్కరు వారి వారిబాధ్యతలను తెలుసుకుని ప్రవర్తిస్తే వారి హక్కులు కూడా కాపాడవచ్చు.  

పరిణామాలు:-ఈ  గృహ  హింసల వల్ల  దీర్ఘకాలిక రోగాలు, ఈర్ష్యాద్వేషాలు, మానసిక వ్యాధులు, జీవితం పై అసంతృప్తి,ఆత్మహత్యలు,   అక్రమ సంబంధాలు,  హత్యలు,  కుటుంబాలు విచ్ఛిన్నం కావడం,  పిల్లలకు  తల్లి గాని, తండ్రి గాని లేకపోవడం, అనాథలు కావటం,  కోర్టుల చుట్టూ తిరగడం,  కేసులు ఫైల్  చేయటం,   విడాకులు తీసుకోవడం  ఎక్కువగా జరుగుతుంది.  దీనివల్ల ఒంటరి బ్రతుకులు,  భద్రత లేకపోవడం,  అసహనంగా జీవితం  కొనసాగించటం, అభద్రతాభావంతో బతకడం జరుగుతుంది. 

పరిష్కారాలు:-భాగస్వామి చేస్తున్న పనిని గుర్తించటం,  పొగడక పోయినా పర్వాలేదు  కనీసం అవమానించ కుండాఉండటం,  పిల్లల ముందు, ఇతరుల ముందు చులకన చేసి, తక్కువగా మాట్లాడకుండా ఉండటం… “WARNING SIGN” గుర్తించి నోరు అదుపులో పెట్టుకోవడం లేదా అక్కడినుంచి లేచి పక్కకువెళ్లిపోవడం,  కోపం తగ్గిన తర్వాత  మాట్లాడుకోవడం, , భాగస్వామి ఫీలింగ్స్ ను,  భావాలను,  బాధలను,ఇబ్బందినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, వారి పనిలో సహాయం చేయటం,  కోపం తో వున్నపుడురెచ్చగొట్టక పోవటం... అసభ్య పదజాలం  వాడకపోవటం, చేయి,  నోరు అదుపులో పెట్టుకోవడం  చేస్తే సగానికిపైగా సమస్యలు పరిష్కారం అవుతాయి..

అయినా శారీరక మానసిక హింస ఎక్కువగా ఉంటే పోలీసులకు ఫోన్ చేయటం లేదా సహాయ కేంద్రాలు నెంబర్లు ముందుగానే దగ్గరగా ఉంచుకోవడం వల్ల తక్షణమే వాళ్ళకి ఫోన్ చేసి సహాయం పొందడం మంచిది. ఈ లాక్ డౌన్  సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళా హెల్ప్ లైన్ లో గాని,  పోలీస్ స్టేషన్స్ లో గాని ఎక్కువగా ఉన్నాయి కౌన్సిలింగ్ చేసి ఎంత  సర్దుబాటు చేసి పంపిస్తున్న ఈ గృహహింస కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.  


గృహ హింస వల్ల అందరూ బాధపడుతున్నారు....
"ఈ గృహ హింస వల్ల బాధపడుతున్నది.....మహిళలు, పిల్లలు మాత్రమే కాదు ఆమె వేసే కేసుల వల్ల భర్త  అతని తరపు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మిగతా ప్రపంచ దేశాలు ఎంతో ఉన్నతంగా ఊహించే భారతదేశ కుటుంబ  వివాహ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ బలంగా  ఉండి భవిష్యత్తు తరం వాళ్ళు సంతోషంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేలా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ  సమానమే, ఏ ఒక్కరు ఎక్కువా కాదు తక్కువా కాదు,  వారి వారి స్థానాలలో వారి అవసరం కుటుంబానికి ఎంతో ఉంటుంది.  కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది.  దేశ గౌరవం ప్రపంచ దేశాలలో  పెరుగుతుంది. అర్థం చేసుకుని మీ భాగస్వామిని గౌరవించండి. " -ఆకుల.రమ్య కుమారి, హైకోర్టు న్యాయవాది.


logo