గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 20:50:04

జులైలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు

జులైలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు

న్యూఢిల్లీ : వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. మంగళవారం మాట్లాడుతూ జులైలో అంతర్జాతీయ విమానాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసున్నామని, కచ్చితమైన తేదీని ప్రకటించలేమని తెలిపారు. ఇందుకు వాటాదారులు, వినియోగదారులకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెలలో విమాన సర్వీసులు నడుపుతామనే నమ్మకం కూడా ఉందనీ,  స్పష్టమైన తేదీని ప్రకటించలేమని చెప్పారు. కాగా, దేశీయ విమానాలు తిరిగి ప్రారంభమైన రోజు నుంచి ఈ నెల 15వరకు 1,35,954 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇందుకు 1,464 విమాన సర్వీసులను వినియోగించినట్లు పేర్కొన్నారు. 


logo