బుధవారం 02 డిసెంబర్ 2020
National - Aug 13, 2020 , 15:20:02

షెడ్యూల్ ప్రకారమే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

షెడ్యూల్ ప్రకారమే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

పనాజి: భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ ఏడాది నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2020ని షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో నిర్వహిస్తామని గురువారం ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తామని అన్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరిస్తామని ప్రమోద్ సావంత్ వెల్లడించారు.