బుధవారం 08 జూలై 2020
National - Jun 25, 2020 , 14:25:01

కరోనా కేంద్రంగా.. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం

కరోనా కేంద్రంగా.. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం

డెహ్రాడూన్‌: దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో వైరస్‌ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నది. దీంతో కరోనా రోగులను చేర్చుకోలేక దవాఖానలు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఇతర అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటున్నాయి. హోటల్స్‌తోపాటు క్రీడా మైదానాలను కరోనా కేంద్రాలుగా మార్చుతున్నాయి.

తాజాగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం డెహ్రాడూన్‌లోని ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని కరోనా కేంద్రంగా తీర్చిదిద్దింది. ఇందులో సుమారు 750 పడకలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గురువారం దీన్ని సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. logo