బుధవారం 15 జూలై 2020
National - Jun 26, 2020 , 17:21:41

జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు జూలై 15 వరకు  కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్‌ నుంచి విదేశాలకు లేదా విదేశాల నుంచి భారత్‌కు అంతర్జాతీయ విమాన రాకపోకలను జూలై 15 అర్ధరాత్రి వరకు నిలిపివేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే రవాణా సర్వీసులు, డీజీసీఏ అనుమతించే ప్రయాణ విమానాలకు ఇది వర్తించదని పేర్కొంది. 

కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎయిర్‌ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి డీజీసీఏ మినహాయింపు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో మార్చి 25న దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కాగా, ఈ నిలిపివేతను ఇప్పటి వరకు రెండుసార్లు పొడిగించింది. 

logo