మంగళవారం 26 జనవరి 2021
National - Jul 13, 2020 , 14:01:09

వారిది అంత‌ర్గ‌త కుమ్ములాట‌: బీజేపీ ఎంపీ

వారిది అంత‌ర్గ‌త కుమ్ములాట‌: బీజేపీ ఎంపీ

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో రాజ‌కీయ సంక్షోభంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ పీపీ చౌధ‌రి స్పందించారు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌లో నెల‌కొన్న రాజ‌కీయ అనిశ్చితి కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం జ‌రుగుతున్న అంత‌ర్గ‌త పోరాటమ‌ని ఆయన అభివ‌ర్ణించారు. రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ పార్టీని చీల్చిన ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ బీజేపీలో చేరే అవ‌కాశం ఉందా అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధాన‌మిస్తూ.. త‌మ‌ పార్టీలో కోట్ల మంది స‌భ్యులున్నారని, పార్టీలో చేరాల‌నుకునే ప్ర‌తి ఒక్క‌రికి త‌మ త‌లుపులు తెరిచే ఉంటాయ‌ని చెప్పారు. 

రాజ‌స్థాన్‌లో ముఖ్య‌మంత్రి అశోక్‌గెహ్లాట్‌, ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్‌ పైల‌ట్ మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేర‌డంతో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తిరుగుబావుటా ఎగుర‌వేసిన స‌చిన్ పైల‌ట్ తన‌వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, గెహ్లాట్ స‌ర్కారు మైనారిటీలో ప‌డింద‌ని ప్ర‌క‌టించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి అక్ర‌మంగా గ‌ద్దెనెక్కేందుకు బీజేపీ కుట్ర చేస్తున్న‌ద‌ని గెహ్లాట్ ఆరోపిస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo