ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 13:49:39

వ్యక్తిగత రుణాల పై వడ్డీ రేట్లు .... ఏ ఏ బ్యాంకు ఎంతెంత అంటే ....?

 వ్యక్తిగత రుణాల పై వడ్డీ రేట్లు .... ఏ ఏ బ్యాంకు ఎంతెంత అంటే ....?

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నారా? తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రుణం పొందేముందు ఏ బ్యాంక్ తక్కువ వడ్డీకే రుణం అందిస్తున్నదో తెలియాలి. అప్పుడు మీకు ప్రయోజనం కలుగుతుంది. పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా రుణాలపై వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. అంతేకాకుండా పర్సనల్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఇంకా ఇతర చార్జీలు కూడా ఉంటాయి. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే లోన్ కోసం అప్లై చేసుకోవడం మంచిది.

అందుకోసమే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ బ్యాంకుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి  అవి ఏంటంటే.... ఇండియన్ బ్యాంక్ ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నది. వడ్డీ రేటు 9.2 శాతం నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఇదే వడ్డీ రేటుకు రుణం ఆఫర్ చేస్తున్నది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్బీఐ) కూడా తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బీ) బ్యాంక్‌లో పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 9.65 శాతంగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ 9.85 శాతం వడ్డీకి, సిటీ బ్యాంక్ 9.99 శాతం వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి. ఈ బ్యాంకులు మాత్రమే కాకుండా మరో 4 బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. యూకో బ్యాంక్ పర్సనల్ లోన్స్‌పై 10.05 శాతం వడ్డీని వసూలు చేస్తున్నది. సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఇదే స్థాయిలో వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.5 శాతంగా ఉంది. హెచ్ఎస్‌బీసీ బ్యాంక్‌లో కూడా ఇదే వడ్డీ కొనసాగుతున్నది.


logo