శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 08:58:57

అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల మూసివేత‌కు ఆదేశాలు

అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల మూసివేత‌కు ఆదేశాలు

జైపూర్ : క‌రోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వివిధ స‌రిహ‌ద్దుల‌ వెంబ‌డి కొత్త వ్య‌క్తులు రాష్ట్రంలోకి ప్ర‌వేశించకుండా ఉండేందుకు అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను మూసివేయాల‌ని సీఎం అశోక్ గెహ్లాట్ నిర్ణ‌యించారు. 

రాష్ట్రంతో అనుసంధానంగా ఉన్న అన్ని అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల వెంబడి రాక‌పోక‌ల‌ను నిలిపేయా‌లని  అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడట‌మే ప్ర‌భుత్వ ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మ‌ని, వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను నిబంధ‌న‌ల‌కు మేర‌కు మాత్ర‌మే రాష్ట్రంలోకి అనుమ‌తించాల‌ని అధికారుల‌కు నిర్దేశించారు. రాజస్థాన్ లో ఇప్ప‌టివ‌ర‌కు 3061 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..77 మంది మృతి చెందారు. మ‌రోవైపు అత్య‌వ‌స‌రం కాకుండా రోడ్ల‌పై వ‌చ్చే వాహ‌నాల‌ను పోలీసులు సీజ్ చేస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo