గురువారం 02 జూలై 2020
National - Jun 25, 2020 , 07:57:08

ఈనెల 30 వరకు అంతర్‌ జిల్లా రవాణా బంద్‌

ఈనెల 30 వరకు అంతర్‌ జిల్లా రవాణా బంద్‌

చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లాల పరిధిలో వాహనాల రాకపోకలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 30 వరకు అంతర్‌ జిల్లా రాకపోకలకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను అనుమతించమని సీఎం కే పళనిస్వామి ప్రకటించారు. కరోనాను వ్యాప్తిని నిలువరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

ఆర్టీసీ బస్సులు జిల్లా సరిహద్దుల వరకు మాత్రమే నడుస్తాయని వెల్లడించారు. ప్రవేటు వాహనాలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అనుమతించమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ-పాస్‌ పొందిన వాహనాలను మాత్రమే జిల్లా దాటడానికి అనుమతిస్తామని చెప్పారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 67,468కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 866 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 2,865 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 33 మంది మరణించారు. 


logo