గురువారం 09 జూలై 2020
National - Jun 17, 2020 , 19:45:13

చైనీస్‌ యాప్‌లు వాడకుండా చూడాలి

చైనీస్‌ యాప్‌లు వాడకుండా చూడాలి

న్యూఢిల్లీ : చైనాతో సంబంధం ఉన్న 52మొబైల్‌ అప్లికేషన్లను ఉపయోగించకుండా చూడాలని, ఈ మేరకు ప్రజలకు కూడా సూచనలివ్వాలని ఇంటిలిజెన్స్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని బుధవారం కోరారు. ఈ యాప్‌లు ఎంతమాత్రం సురక్షితం కాదని, భారత్ వెలుపల పెద్ద మొత్తంలో డేటాను వెలికితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూమ్ యాప్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్‌ఇట్, క్లీన్‌ మాస్టర్‌తో పాటు మరో 52 అప్లికేషన్లను ఇంటెలిజెన్స్ అధికారులు తమ జాబితాలో పేర్కొన్నారు. కాగా, ఇంటెలిజెన్స్ అధికారులు సూచించిన వీటికి జాతీయ భద్రతా కౌన్సిల్ కూడా మద్దతు పలికిందని, ఇవి భారత దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమని సంబంధిత అధికారులు ధ్రువీకరించుకున్నారని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సిఫార్సులపై కేంద్రం లోతుగా చర్చలు జరుపుతోందని, ప్రతి మొబైల్ యాప్‌తో వచ్చే ప్రమాదాన్ని ఒక్కొక్కటిగా అధికారులు పరిశీలిస్తూనే ఉన్నారని సీనియర్‌ అధికారి స్పష్టం చేశారు. జూమ్ యాప్ ఏమాత్రం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లోనే స్పష్టం చేసిన విషయం విదితమే. 


logo