వచ్చే ఏడాది నౌకాదళం అమ్ములపొదిలోకి INS విక్రాంత్!

న్యూఢిల్లీ: భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో అధునాతన అస్త్రం చేరనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమానవాహక యుద్ధనౌక INS విక్రాంత్ నౌకాదళంలో సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన్నుల బరువైన ఈ విక్రాంత్ నౌక నిర్మాణంతో భారత్ విమానవాహక యుద్ధనౌకలు తయారు చేసిన ఐదో దేశంగా అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన నిలిచింది. కాగా, INS విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీ ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్న INS విక్రాంత్ 2022 నాటికి నౌకాదళంలోకి రానుంది.
అంతరిక్ష పరిశోధనలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్ యుద్ధనౌకల విషయంలో కూడా బలీయమైన శక్తిగా ఎదగాలన్న కాంక్షతో INS విక్రాంత్ తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. దాంతో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ క్లాస్ యుద్ధ నౌక సిద్ధమైంది. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ యుద్ధనౌక ఇదే. కాగా, గతంలో నౌకాదళంలో సేవలందించిన INS విక్రాంత్ 1997లో సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో విమానవాహక యుద్ధనౌక సిద్ధమవుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు