మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 18:16:36

55 రోజుల్లో 138900 కి.మీ ప్రయాణం.. 5 దేశాలకు సాయం

55 రోజుల్లో 138900 కి.మీ ప్రయాణం.. 5 దేశాలకు సాయం

ఢిల్లీ : భారత నావికాదళంలో ఒక ప్రధాన మైలురాయి. ఐఎన్‌ఎస్‌ కేసరి నౌక 55 రోజుల్లో 75 వేల నాటికల్‌ మైళ్లు (138900 కి.మీ) ప్రయాణించి ఐదు దేశాలను చుట్టివచ్చింది. మాల్దీవులు, మారిషస్‌, మడగాస్కర్‌, కొమొరోస్‌, సీషెల్స్‌ దేశాలకు కోవిడ్‌-19 సాహాయాన్ని అందించింది. మిషన్‌ సాగర్‌ కింద మే 10న ప్రయాణం ప్రారంభించిన ఐఎన్‌ఎస్‌ కేసరి జూన్‌ 28న భారతదేశానికి తిరిగి వచ్చింది. 

కోవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో హిందూ మహాసముద్ర పొరుగు దేశాలకు సహాయం అందించడమే ఈ మిషన్‌ ముఖ్య లక్ష్యం అని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఐదు దేశాలకు ఆహార పదార్థాలు, మెడిసిన్స్‌, ఆయుర్వేద మందులు అందజేయడంతో పాటు మారిషస్‌, కొమెరోస్‌కు వైద్య సహాయక టీంలు పంపించారు. ఐఎన్‌ఎస్‌ కేసరికి ఐదు హిందూ మహాసముద్ర దేశాలలో ఆత్మీయ స్వాగతం లభించింది. నౌక మొదటగా మల్దీవులకు చేరుకుంది. అనంతరం మారిషస్‌కు, ఆపై మే నెల చివరి నాటికి మడగాస్కర్‌కు అక్కడినుంచి కొమెరోస్‌కు, అక్కడినుంచి జూన్‌ 7వ తేదీన సిషెల్స్‌కు చేరుకుంది.  


logo