సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 22, 2020 , 10:38:46

నౌకాద‌ళంలోకి ఐఎన్ఎస్ కావ‌ర‌త్తి యుద్ధ‌నౌక

నౌకాద‌ళంలోకి ఐఎన్ఎస్ కావ‌ర‌త్తి యుద్ధ‌నౌక

హైద‌రాబాద్‌: యాంటీ స‌బ్‌మెరైన్ యుద్ధ నౌక  ఐఎన్ఎస్ కావ‌ర‌త్తి ఇవాళ విశాఖ‌ప‌ట్ట‌ణంలోని నౌకాశ్ర‌యంలో జ‌ల‌ప్ర‌వేశం చేసింది.  భార‌త నౌకాద‌ళంలోకి ఆ యుద్ధ‌నౌక‌ను ప్ర‌వేశ‌పెట్టారు.  ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వాణే ఆ యుద్ధ‌నౌక‌ను క‌మిష‌న్ చేశారు. ఐఎన్ఎస్ కావ‌ర‌ట్టి 90 శాతం స్వ‌దేశీయంగా త‌యారైంది. యాంటీ స‌బ్‌మెరైన్ వార్‌షిప్స్‌లో భాగంగా నేవీ చేప‌ట్టిన ప్రాజెక్టు 28లో ఇది చిట్ట‌చివ‌రి యుద్ధ‌నౌక కావ‌డం విశేషం. ఈ యుద్ధ‌నౌక నేవీలో కామోర్టా క్లాసుకు చెందిన‌ది. 2003లో ప్రాజెక్టు 28ను ఆమోదించారు.  ఈ ప్రాజెక్టులో భాగంగా త‌యారైన  ఐఎన్ఎస్ క‌మోర్టా, ఐఎన్ఎస్ కాద్‌మ‌ట్‌, ఐఎన్ఎస్ కిల్త‌న్‌ల‌ను అభివృద్ధి చేశారు. డైర‌క్ట‌రేట్ ఆఫ్ నేవ‌ల్ డిజైన్ .. ఐఎన్ఎస్ కావ‌ర‌త్తిని డిజైన్ చేసింది. కోల్‌క‌తాకు చెందిన గార్డెన్ రీస‌ర్చ్ షిప్‌బిల్డ‌ర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని నిర్మించారు. జ‌లాంత‌ర్గాములను ఎదుర్కొనేందుకు సెన్సార్ల‌ను అమ‌ర్చారు.