మంగళవారం 26 మే 2020
National - May 15, 2020 , 19:27:01

మాల్దీవుల నుంచి బయల్దేరిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ

మాల్దీవుల నుంచి బయల్దేరిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను జలమార్గం ద్వారా తీసుకువచ్చేందుకు కేంద్రం ఆపరేషన్‌ సముద్రసేత ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవుల నుంచి 588 మంది భారతీయులతో నౌకాదళ ఓడ ఐఎన్‌ఎస్‌ జలాశ్వ భారత్‌కు బయల్దేరింది. కేరళలోని కొచ్చి తీరానికి చేరుకోనుంది. ప్రయాణికుల తరలింపుపై భారత హై కమిషనర్‌ సంజయ్‌ సుధీర్‌ మాల్దీవుల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవుల నుంచి ఐఎన్‌ఎస్‌ జలాశ్వలో రెండో విడత భారతీయులను తరలింపును చేపట్టారు. మిగతావారిని ఎయిర్‌లిఫ్ట్‌ చేయనున్నారు.


logo