గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 10:02:38

19 మంది గ‌ర్భిణుల‌తో.. కొచ్చి చేరుకున్న యుద్ధ‌నౌక జ‌ల‌ష్వా

19 మంది గ‌ర్భిణుల‌తో.. కొచ్చి చేరుకున్న యుద్ధ‌నౌక జ‌ల‌ష్వా

హైద‌రాబాద్‌: మాల్దీవుల నుంచి ఐఎన్ఎస్ జ‌ల‌ష్వా .. కేర‌ళ‌లోని కొచ్చి తీరానికి చేరుకున్న‌ది. ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతులో భాగంగా.. మాల్దీవుల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను యుద్ధ‌నౌక‌లో తీసుకువచ్చారు.  సుమారు 698 మంది భార‌తీయుల‌ను ఆ నౌక‌లో త‌ర‌లించారు. దీంట్లో 19 మంది గ‌ర్భిణులు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. మాల్దీవుల్లోని భార‌తీయ హైక‌మిష‌న‌ర్ సంజ‌య్ సుధిర్‌.. భార‌తీయ నేవీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. భారీ ఆప‌రేష‌న్‌కు స‌హ‌క‌రించిన మాల్దీవుల ప్రభుత్వానికి కూడా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. యుద్ధ‌నౌక జ‌ల‌ష్వా గురువార‌మే మాలే చేరుకున్న‌ది. మాల్దీవులుకు వెళ్తున్న మ‌రో యుద్ధ‌నౌక ఐఎన్ఎస్ మ‌గ‌ర్‌.. త‌మిళ‌నాడులోని ట్యూటికోర‌న్‌కు వెళ్తుంద‌న్నారు. దాంట్లో 200 మంది భార‌తీయులు ఉండ‌నున్నారు. మ‌ళ్లీ వ‌చ్చే వారం కూడా ఇలాంటి ట్రిప్పులు ఉంటాయ‌న్నారు.  


logo