గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 19:46:20

వినూత్న ప్రచారం : వాహనాలకు ఉచితంగా శానిటైజేషన్

వినూత్న ప్రచారం : వాహనాలకు ఉచితంగా శానిటైజేషన్

ముంబై : చైనాకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లోని కస్టమర్ల కోసం వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ఎమ్‌జి-సేవా పేరుతో ఓ కొత్త రకం పేరెంట్స్ ఫస్ట్ ఇన్షియేటివ్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఎమ్‌జి యజమానుల కుటుంబాలు ఉపయోగించే వాహనాలను కంపెనీ ఉచితంగా శానిటైజ్ చేసి ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎమ్‌జి బ్రాండ్ డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ కొత్త ప్రణాళిక అమలులో ఉంటుంది. వాహనం మోడల్‌తో సంబంధం లేకుండా ఇంట్లో ఒక కారు వరకు తాము ఉచితంగా శానిటైజ్ చేస్తామని ఎమ్‌జి మోటార్స్ తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఈ క్యాంపైన్ ఈ ప్రక్రియలో భాగంగా.. స్టీరింగ్ వీల్, వైపర్ అండ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్ స్టాక్స్, డోర్ హ్యాండిల్స్,లాక్స్, ఎయిర్ కండిషనింగ్ కోసం అన్ని కంట్రోల్ స్విచ్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విండో ఆపరేషన్స్ వంటి అన్ని టచ్ పాయింట్లను ఉచితంగా శుభ్రపరచి, శానిటైజ్ చేయనున్నారు. భారత్-చైనాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా దేశంలో చైనా ఉత్పత్తులు, చైనా కంపెనీలపై ఒక రకమైన తిరుగుబాటు మొదలైన పరిస్థితుల్లో భారతీయులకు మరింత చేరువయ్యేందుకు ఈ చైనీస్ కార్ కంపెనీ కొత్త ప్రయోగాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే, ఈ కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్‌జి కార్లను కలిగి ఉన్న కస్టమర్లు తమ వద్ద ఉన్న సెకండ్ కారు లేదా తమ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఈ స్కీమ్ కింద ఉచితంగా ఎమ్‌జి డీలర్‌షిప్‌ల వద్ద శానిటైజ్ చేయించుకోవచ్చు


logo