మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 19:06:05

ఆ జైల్లో వీడియో కాన్ఫ‌రెన్స్‌ ములాక‌త్‌లు

ఆ జైల్లో వీడియో కాన్ఫ‌రెన్స్‌ ములాక‌త్‌లు

శ్రీన‌గ‌ర్‌: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గత నాలుగు నెల‌ల నుంచి జైల్ల‌లో ములాక‌త్‌లు ఆగిపోయాయి. దీంతో ఖైదీలు, వారి కుటుంబ‌స‌భ్యులు ఒక‌రినొక‌రు క‌లిసే అవ‌కాశం లేక తీవ్ర మ‌నోవేద‌న అనుభ‌విస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌మ్ముక‌శ్మీర్‌లోని అంఫాలా జైల్ సూప‌రింటెండెంట్ మీర్జా స‌లీమ్ అహ్మ‌ద్ బేగ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఖైదీలు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వారి కుటుంబ‌స‌భ్యుల‌తో ములాక‌త్ అయ్యే ఏర్పాటు చేశారు.

వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ములాక‌త్‌ల‌తో చాలా ప్ర‌యోజనాలు ఉన్నాయ‌ని అహ్మ‌ద్ బేగ్ చెప్పారు. ఈ విధానంవ‌ల్ల ఖైదీలకు, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు మ‌నోవేదన తొల‌గిపోతుంద‌ని, అదే స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రించ‌కుండా అడ్డుకున్న‌ట్ల‌వుతుంద‌ని బేగ్ పేర్కొన్నారు. కాగా అటు ఖైదీలు, ఇటు ఖైదీల కుటుంబ‌స‌భ్యులు కూడా జైల‌ర్ నిర్ణ‌యంపై సంతోషం వ్య‌క్తంచేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo