ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్పై యూపీలో సిరా

లక్నో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లో ఆయనపై సిరా చల్లారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన హిందూ యువ వాహిణి పనిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని అధికార ఆప్ పార్టీ ఎమ్మెల్యే అయిన సోమనాథ్ భారతి ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్ల పరిస్థితిని చూసేందుకు ఆదివారం రాత్రి రాయ్‌బరేలికి వచ్చారు. ఇరిగేషన్ అతిథి గృహంలో బస చేసిన ఆయన సోమవారం ఉదయం ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో హిందూ యువ వాణికి చెందిన ఒక కార్యకర్త సోమనాథ్ భారతిపై నల్ల ఇంకు చల్లి పారిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆసుపత్రుల గురించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ కార్యకర్తలు మండిపడ్డారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ఆయనను భద్రత మధ్య అమేథీకి తీసుకెళ్లారు.
కాగా, కొన్ని రోజుల కిందట మిర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల పడకల వద్ద కుక్కలు ఉన్న ఫొటోలను, అక్కడి స్కూళ్ల దుస్థితిపై ఫొటోలను తీసిన సోమనాథ్ భారతి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాయ్‌బరేలికి వచ్చిన ఆయనను హిందూ యువ వాణి కార్యకర్తలు అడ్డుకుని సిరా చల్లారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో మార్చి నెలలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఆప్ నేతలు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో తరచుగా ఆ రాష్ట్రంలో పర్యటించి స్థానిక సమస్యలపై గళమెత్తుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
- ఎగ్ ఫేస్ మాస్క్‌తో ఎన్నో లాభాలు..