మంగళవారం 26 జనవరి 2021
National - Dec 18, 2020 , 15:53:10

హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాది మృతి

హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాది మృతి

శ్రీన‌గ‌ర్ : ద‌క్షిణ క‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో డిసెంబ‌ర్ 17వ తేదీన ఉగ్ర‌వాదులు సైనికుల‌ను ల‌క్ష్యం చేసుకుని కాల్పులు జ‌రిపారు. సంగం - నైనా రోడ్డు ఈ క్ర‌మంలో బ‌ల‌గాలు కూడా కాల్పులు జ‌ర‌ప‌డంతో ఓ ఉగ్ర‌వాది తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో ఆ ఉగ్ర‌వాదిని అదుపులోకి తీసుకుని శ్రీ మ‌హారాజా హ‌రిసింగ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఉగ్ర‌వాది మృతి చెందాడు. ఆ ముష్కరుడిని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన జ‌హీర్ అబ్బాస్ లోనేగా పోలీసులు గుర్తించారు. 

ప‌ట్టుబ‌డిందిలా..

డిసెంబ‌ర్ 17న అర్ధ‌రాత్రి అనంత్‌నాగ్‌లోని సంగం - నైనా ర‌హ‌దారిపై ఇద్ద‌రు ముష్క‌రులు బైక్‌పై వెళ్తున్నారు. వారిని ఆపేందుకు బ‌ల‌గాలు య‌త్నించాయి. ఈ క్ర‌మంలో బైక్‌పై వెనుకాల ఉన్న ఉగ్ర‌వాది కాల్పులు జ‌రిపాడు.‌ దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. గాయ‌ప‌డ్డ ఉగ్ర‌వాదిని అరెస్టు చేసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.


logo