గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 11:45:54

క‌రోనా భ‌యం.. ఇన్ఫోసిస్ బిల్డింగ్ ఖాళీ

క‌రోనా భ‌యం.. ఇన్ఫోసిస్ బిల్డింగ్ ఖాళీ

హైద‌రాబాద్‌: బెంగుళూరులో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌కు చెందిన ఓ బిల్డింగ్‌ను ఖాళీ చేయించారు. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు.  ముంద‌స్తు చ‌ర్య‌గా ఐఐపీఎం బిల్డింగ్‌లో ఉన్న‌వారిని త‌ర‌లిస్తున్న‌ట్లు ఇన్ఫోసిస్ సంస్థ వెల్ల‌డించింది. క‌ర్నాట‌క‌లోని బెంగుళూరులో ఇన్ఫోసిస్‌కు భారీ క్యాంప‌స్ ఉన్న‌ది.  అక్క‌డ డ‌జ‌న్ల సంఖ్య‌లో బిల్డింగ్‌లు ఉన్నాయి.  డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు, కార్పొరేట్ హౌజ్‌లు ఉన్నాయి.  అయితే ఉద్యోగుల భ‌ద్ర‌తా దృష్ట్యా.. బిల్డింగ్‌ను శానిటైజ్ చేస్తున్న‌ట్లు డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ హెడ్ గురురాజ్ దేశ్‌పాండే తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా వ‌చ్చే దుష్ ప్ర‌చారాల‌కు దూరంగా ఉండాల‌న్నారు.   


logo
>>>>>>