మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 18:24:22

ఇండియాకు పెట్టుబడుల ప్రవాహం

ఇండియాకు పెట్టుబడుల ప్రవాహం

ఢిల్లీ : ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో వణికిపోతుంటే.... భారత్ కు మాత్రం పెట్టుబడుల ప్రవాహం పెరుగుతున్నది. భారత్ లో కరోనా ప్రభావం ఉన్నా ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం  శుభపరిణామం అని ఆర్థిక నిపుణులు  చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా తర్వాత   ఇండియా లోనే అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వంటి అవరోధాలు ఉన్నప్పటికీ భారత్ కు వచ్చే దశాబ్ద కాలం బాగా కలిసి రానుందని విశ్లేషకులు అంటున్నారు. దీనిని ఇటీవలి కాలంలో భారత్ లోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడుల సరళి ప్రస్ఫుటం చే స్తున్నదని చెబుతున్నారు. అందుకే వచ్చే 10 ఏండ్ల వరకు భారత్ లో  పెట్టుబడులకు మంచి భవిష్యత్ ఉందని భావిస్తున్నారు.

ఇండియాలో ఈ కామర్స్, ఫార్మస్యూటికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికా కు చెందిన ప్రముఖ వెంచర్ కాపిటల్ కాపిటలిస్ట్, పారిశ్రామికవేత్త, ఫిలాంత్రపిస్ట్ ఎం ఆర్ రంగస్వామి వెల్లడించారు. గత ఆరు నెలలుగా అమెరికా సహా ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో యుద్ధం చేస్తుంటే భారత్ కు మాత్రం ఇన్వెస్టర్లు క్యూ కడుతుండటం విశేషం. రంగస్వామి అంచనా ప్రకారమే గత కొన్ని నెలల్లోనే 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ 1,50,000 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి.

దీంతో ఇండియా కు ప్రస్తుతం స్వర్ణ యుగమేనని ఆయన అభివర్ణించారు. కిరాణా షాపులు మొదలు కొని, మెడిసిన్, టెలి మెడిసిన్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ ఇలా ఏ రంగం తీసుకున్నా అందులో డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో అపార అవకాశాలు ఉన్నాయి. ఈ బంగారు అవకాశాన్ని భారత్ చక్కగా ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఒక స్వర్ణ యుగంలోకి భారత్ ప్రవేశించే సమయం ఎంతో దూరంలో లేదు అని ఆయన పేర్కొన్నారు.logo