సోమవారం 06 జూలై 2020
National - Jun 24, 2020 , 20:28:49

బ‌హిర్భుమికి వెళ్లిన గ‌ర్భిణి ప్ర‌స‌వం.. ప‌సిగుడ్డును లాక్కెళ్లిన జంతువు

బ‌హిర్భుమికి వెళ్లిన గ‌ర్భిణి ప్ర‌స‌వం.. ప‌సిగుడ్డును లాక్కెళ్లిన జంతువు

ల‌క్నో : ఇది హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌.. నెల‌లు నిండిన ఓ గ‌ర్భిణి.. మంగ‌ళ‌వారం పొద్దున్నే.. స‌మీప పొలాల్లోకి బ‌హిర్భుమికి వెళ్లింది. అక్క‌డే ఆమెకు పురిటి నొప్పులు వ‌చ్చాయి. నొప్పులు తీవ్రం కావ‌డంతో.. పొలాల్లోనే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ త‌ర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. అంత‌లోనే ఓ అడ‌వి జంతువు వ‌చ్చి ప‌సిపాప‌ను లాక్కెళ్లింది. ఈ విషాద ఘ‌ట‌న యూపీలోని ఫిన్ హ‌ట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని జోధ‌పురా గ్రామంలో చోటు చేసుకుంది. 

బ‌హిర్భుమికి వెళ్లిన గ‌ర్భిణి.. ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో.. ఆమె కుటుంబ స‌భ్యులు అక్క‌డికి వెళ్లారు. ఆమె స్పృహ కోల్పోయింది. ప్ర‌స‌వించిన ఆన‌వాళ్లు ఉన్నాయి. కానీ బిడ్డ లేదు. ఏదో జంతువు.. ప‌సిబిడ్డ‌ను లాక్కెళ్లి ఉండొచ్చ‌ని గ్రామ‌స్తులు అనుమానిస్తున్నారు. 

అయితే గ‌తేడాది జోధ‌పురా గ్రామానికి ఓడీఎఫ్ గా ప్ర‌క‌టించారు. దీనిపై ఇప్పుడు గ్రామ‌స్తులు మండిప‌డుతున్నారు. గ్రామంలో స‌గానికి సగం మందికి మ‌రుగుదొడ్లు లేవ‌ని ఆగ్ర‌హం వెలిబుచ్చారు. గ్రామ స‌ర్పంచ్ గ‌జేంద్ర సింగ్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఆరోపించారు.  ఈ ఘ‌ట‌న‌కు స‌ర్పంచే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా బాధితురాలు శిల్పి మాట్లాడుతూ.. మంగ‌ళ‌వారం ఉద‌యాన్ని బ‌హిర్భుమి కోస‌మ‌ని స‌మీప పొలాల్లోకి వెళ్లాను. ఆ స‌మ‌యంలోనే త‌న‌కు పురిటి నొప్పులు వ‌చ్చాయి. దాంతో అక్క‌డే బిడ్డ‌ను ప్ర‌స‌వించాను. త‌ద‌నంత‌రం స్పృహ కోల్పోయాను అని చెప్పింది. 


logo