సోమవారం 13 జూలై 2020
National - Jun 29, 2020 , 18:08:18

క‌రోనా భ‌యం.. చెట్టెక్కి ప‌డుకున్న మందు బాబు

క‌రోనా భ‌యం.. చెట్టెక్కి ప‌డుకున్న మందు బాబు

బెంగ‌ళూరు : ఓ మందు బాబు క‌రోనా భ‌యంతో చెట్టెక్కి ప‌డుకున్నాడు. గాఢ నిద్ర‌లో ఉన్న అత‌నిలో ఎలాంటి చ‌ల‌నం లేదు. అత‌ను చ‌నిపోయాడ‌ని భావించిన స్థానికుల‌కు కాసేప‌టికి దిమ్మ‌తిరిగే షాకిచ్చాడు. 

గుల్బ‌ర్గా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ కాలేజీ ప‌రిస‌ర ప్రాంతంలోని ఓ వ్య‌క్తి ఆదివారం పీక‌ల దాకా మ‌ద్యం సేవించాడు. ఆ త‌ర్వాత అత‌ను చెట్టెక్కి ప‌డుకున్నాడు. అత‌న్ని గ‌మ‌నించిన స్థానికులు.. లేపే ప్ర‌య‌త్నం చేశారు. ఉలుకు, ప‌లుకు లేక‌పోవ‌డంతో వారు ఆందోళ‌న‌కు గురై పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. ఓ ఇద్ద‌రిని చెట్టుపైకి ఎక్కించారు. పోలీసులు కూడా ఆ వ్య‌క్తి చ‌నిపోయి ఉంటాడ‌ని భావించారు. కానీ చెట్టెక్కిన ఇద్ద‌రు వ్య‌క్తులు.. అత‌ను బ‌తికే ఉన్నాడ‌ని నిర్ధారించారు. ఆ మందు బాబు వ‌ద్ద మ‌ద్యం బాటిళ్ల‌ను చూసి అంద‌రూ షాక్ అయ్యారు. 

మొత్తానికి చెట్టు పైనుంచి కింద‌కు దింపిన త‌ర్వాత‌.. ఆ వ్య‌క్తిని పోలీసులు ప్ర‌శ్నించారు. ఈ మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా కేసులు ఉన్నందున.. ఆ భ‌యంతో చెట్టెక్కి ప‌డుకున్నాన‌ని చెప్ప‌డంతో పోలీసులు విస్తుపోయారు. క‌రోనా నుంచి ప్రాణాల‌ను కాపాడుకునేందుకు చెట్టెక్కి గాఢ నిద్ర‌లోకి జారుకున్నాన‌ని స‌ద‌రు వ్య‌క్తి పోలీసుల‌కు తెలిపాడు. 


logo