గురువారం 21 జనవరి 2021
National - Dec 19, 2020 , 18:30:06

పరిశ్రమ పైకప్పు కుప్పకూలి నలుగురు దుర్మరణం

పరిశ్రమ పైకప్పు కుప్పకూలి నలుగురు దుర్మరణం

న్యూఢిల్లీ : ఢిల్లీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమ పైకప్పు కూలిపడి నలుగురు దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విష్ణుగార్డెన్‌ ప్రాంతంలోని మోటార్‌ వైండింగ్‌ పరిశ్రమంలో కార్మికులు పనిచేస్తుండగా 10 గంటల సమయంలో మొదటి అంతస్తు పైకప్పు కూలింది. భవనం శిథిలావస్థలో ఉండటం, సామర్థ్యానికి మించి సామగ్రిని నిల్వ చేయడంతో మొదటి అంతస్తు పైకప్పు కుప్పకూలింది.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ఢిల్లీ విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుక్కున్న ఆరుగురిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వీరిలో నలుగురు మృతి చెందారని, ఇద్దరికి ప్రాణాపాయమేమీ లేదని చెప్పారు. మృతులను రమేశ్‌ (35), ఛీన (36) గుడ్డి (45) ట్వింకిల్‌ (25) గా గుర్తించారు. ఉత్తమ్‌నగర్‌కు చెందిన పరిశ్రమ యజమాని మహేంద్ర పాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo