ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 15:01:01

కొటక్ మహీంద్రా తో ఇండస్ఇండ్ బ్యాంకు ఒప్పందం...?

కొటక్ మహీంద్రా తో ఇండస్ఇండ్ బ్యాంకు ఒప్పందం...?

ముంబై : హిందూజా గ్రూప్ కు చెందిన ఇండస్ఇండ్ బ్యాంకుపై ప్రయివేటురంగ కొటక్ మహీంద్రా బ్యాంకు దృష్టి సారించింది. షేర్ల మార్పిడి ద్వారా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం. సంయుక్త సంస్థలో ఇండస్ఇండ్ బ్యాంకు ప్రమోటర్లు హిందూజా గ్రాప్ కొంతమేర వాటాలు తీసుకోనునన్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ అంశంపై కొటక్ మహీంద్రా బ్యాంకు స్పందించాల్సి ఉంది. ప్రచారంలో వాస్తవం లేదని ఇండస్ ఇండ్ బ్యాంకు సీఈవో సుమంత్ తెలిపారు. బ్యాంకు యాజమాన్యం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందన్నారు. కొటక్ మహీంద్ర బ్యాంకు వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కొటక్ మొత్తం స్టాక్‌ను అక్వైర్ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని, అయితే చర్చలు ఇప్పటికే సాగుతున్నాయని సమాచారం.

ఈ ఒప్పందం తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంకు వ్యవస్థాపకులు సంయుక్త బ్యాంకులో కొంత వాటాను నిలుపుకుంటారని, ఈ మేరకు ఉదయ్ కొటక్, హిందూజా గ్రూప్ ల మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ ఒప్పందం వాస్తవరూపం దాలిస్తే ప్రముఖ ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటిగా కొటక్ మహీంద్రా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. ఆస్తులను 83 శాతం మేర పెరగనున్నాయి. మరోవైపు ఇండస్ ఇండ్ బ్యాంకుకు ఇది లైఫ్ లైన్ అవుతుంది. ఈ ఏడాది ఇండస్ ఇండ్ బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ 60 శాతం మేర క్షీణించి 6 బిలియన్ డాలర్లకు క్షీణించింది. కొటక్ మహీంద్రా 2014లో ఐఎన్‌జీ గ్రూప్‌ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 11.2 బిలియన్ డాలర్ల విలువైన హిందుజా గ్రూప్‌లోని సోదరుల మధ్య విభేధాల నేపథ్యంలో బ్యాంక్ విక్రయానికి చర్చలు ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి