గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 13:45:20

హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి.. ఓటమి దిశగా రెజ్లర్‌ యోగేశ్‌ దత్‌

హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి.. ఓటమి దిశగా రెజ్లర్‌ యోగేశ్‌ దత్‌

బరోడా :  హర్యానాలోని ఒకే ఒక్కస్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది. బరోడా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నుంచి ఒలింపిక్‌ కాంస్య పతకం విజేత రెజ్లర్‌ యోగుశ్‌ దత్‌ పోటీచేయగా.. కాంగ్రెస్‌ నుంచి ఇందురాజ్‌ నర్వాల్‌ బరిలో నిలిచారు.  ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ)  జోగేంద్ర సింగ్‌ మాలిక్ను పోటీలో నిలిపింది.‌ వీరితోపాటు ఏడుగురు స్వత్రంత్ర అభ్యర్థులతో సహా మొత్తం 14 మంది తుది బరిలో నిలిచారు. ఈ నెల 3న పోలింగ్‌ జరగ్గా 1.81 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 68 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఎన్నికల్లో  బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్‌ అభ్యర్థి ఇందు రాజ్‌ ప్రత్యర్థి యోగేశ్‌ దత్‌పై 8,708 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  సోనిపట్‌ జిల్లాలోని బరోడా అసెంబీ స్థానం కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు‌, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్‌ హుడాకు పెట్టిన కోట. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇందురాజ్‌ తరఫున  భూపేంద్ర సింగ్‌ హుడా తన కుమారుడు, ఎంపీ దీపేంద్ర హుడాతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. బరోడా శాసనసభ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన శ్రీకృష్ణ హుడా మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరైంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.