గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 01:52:42

కూరగాయలమ్మ ఇంగ్లిష్‌

కూరగాయలమ్మ ఇంగ్లిష్‌

  • ఇండోర్‌ అధికారులు షాక్‌

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని మాల్వా మిల్‌ ప్రాంతంలో రోడ్డు పక్కన తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు అమ్ముతున్న వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా మున్సిపల్‌ అధికారులు ఆదేశించారు. మొన్నటిదాకా లాక్‌డౌన్‌ వల్ల తమ వ్యాపారాలు కుదేలయ్యాయని, ఇప్పుడు వ్యాపారం, అడ్డా వదిలేసి ఎలా బతుకేదని అక్కడి వ్యాపారులు నిరసన చేపట్టారు. ఇంతలో తోపుడు బండిపై పండ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్న రైసా అన్సారీ (36) అధికారుల దాష్టీకంపై గొంతెత్తారు. మీకు మీరుగా రాజుల్లా భావించవద్దని ఇంగ్లిష్‌లో అధికారులను కడిగి పారేశారు. దీంతో అవాక్కయిన అధికారులు ఆమె విద్యార్హతలపై ఆరాతీశారు. తాను దేవీ అహల్య విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశానని, గతంలో ప్రొఫెసర్‌గానూ పనిచేశానని అన్సారీ చెప్పారు. కొన్ని కుటుంబ సమస్యల వల్ల పండ్ల వ్యాపారం చేయాల్సి వచ్చిందని చెప్పారు. అధికారుల దౌర్జన్యంపై రైసా ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మున్సిపల్‌ అధికారులు వెనక్కి తగ్గారు. బండ్ల తొలగింపు కార్యక్రమాన్ని వాయిదా వేశారు.


logo