e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News ఆనియ‌న్ దోశ, మసాలా దోశ‌ కాదు.. ఇది ఫైర్ దోశ‌.. వీడియో

ఆనియ‌న్ దోశ, మసాలా దోశ‌ కాదు.. ఇది ఫైర్ దోశ‌.. వీడియో

భోపాల్‌: ఆనియ‌న్ దోశ‌, మ‌సాలా దోశ, ప్లెయిన్ దోశల గురించి మ‌నంద‌రికీ తెలుసు. ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ గురించి కూడా తెలుసు. కానీ ఫైర్ దోశ గురించి చాలామందికి తెలియ‌దు. ఎందుకంటే ఇదో కొత్త ర‌కం దోశ‌. వాస్త‌వానికి దక్షిణాది అల్పాహారమైన దోశ ఉత్తరాదికి చేరి అనేక మార్పులు చెందుతున్న‌ది. అక్క‌డి వ్యాపారులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రకం దోశలను త‌యారు చేస్తూ వినియోగ‌దారుల‌కు కొత్త రుచులు చూపిస్తున్నారు.

చీజ్, బటర్‌, కూరగాయలను ఉపయోగించి రకరకాల దోశలు త‌యారు చేస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి, ఫుడ్ బ్లాగర్ అమర్ శిరోహీ కూడా తాజాగా కొత్త ర‌కం దోశ‌ను త‌యారు చేశాడు. ఫైర్ దోశ పేరుతో ఓ కొత్త ర‌కం దోశ‌ను భోజ‌న ప్రియుల కోసం అందుబాటులోకి తెచ్చాడు. ఇటీవల ఈ దోశ తయారీ వీడియోను ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ഇവൻ വെറും ദോശയല്ല ഫയർ ദോശ, തീ മാത്രമല്ല രുചിയും ഉണ്ടെന്ന് ഭക്ഷണപ്രേമികൾ,  വീഡിയോ - LIFESTYLE - FOOD | Kerala Kaumudi Online
- Advertisement -

ఆ వీడియోలో దోశ‌ పిండిని పెనం మీద వేసిన తర్వాత బటర్, కారం పొడి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టమాటా, మొక్క జొన్న గింజలు, కొత్తిమీర చల్లాడు. తర్వాత లిక్విడ్ చీజ్, టమోటా సాస్ వేసి దోశ అంతటా పూశాడు. ఆ తర్వాత దోశను ఐదు భాగాలు చేశాడు. అనంత‌రం ఫ్యాన్ ద్వారా మంటను పెంచి దోశను తిర‌గేయ‌కుండానే పై భాగం కూడా మంట‌లో కాలేలా చేశాడు.

പറക്കും ദോശയ്ക്കും ബാഹുബലി ദോശയ്ക്കും ശേഷം തീപ്പൊരി ദോശ, ഒരെണ്ണത്തിന്റെ വില  180 രൂപ | Viral Dosa | Malayala Manorama

ఆ త‌ర్వాత మరోసారి చీజ్ వేసి బాగా కాల్చాడు. అనంత‌రం మంట తీసేసి దోశ ముక్కలను గుండ్రంగా చుట్టాడు. గుండ్ర‌ని దోశ‌ల‌కు మరోసారి లిక్విడ్ చీజ్, చీజ్ వేసి క‌స్ట‌మ‌ర్‌కు అందించాడు. ఈ దోశ త‌యారీకి సంబంధించిన వీడియోను మీరు కూడా ఒక‌సారి వీక్షించండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana