మంగళవారం 14 జూలై 2020
National - Jun 15, 2020 , 18:41:33

క‌రోనా ఎఫెక్ట్‌: పెండ్లి కొడుకుకు రూ.2100 చలానా

క‌రోనా ఎఫెక్ట్‌: పెండ్లి కొడుకుకు రూ.2100 చలానా

ఇండోర్: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఒక‌రి నుంచి ఒక‌రికి వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్ భ‌యంతో అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. అదేవిధంగా మ‌న దేశంలోనూ లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. అయినా కొంత మంది నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్క‌తుండ‌టంతో పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రాల్లో పోలీసులు మ‌రింత క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన పెండ్లి కొడుకుకు ఇండోర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు రూ.2100 చలానా విధించారు. వివాహం చేసుకునేందుకు బంధువుల‌తో క‌లిసి వెళ్తున్న పెండ్లి కొడుకు కారును అధికారులు ఆపారు. ఒకే కారులో పెండ్లి కొడుకుతోపాటు 12 మంది ఉండ‌టంతో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ చ‌లానా విధించారు.    
logo