సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 11:56:49

వ‌ర్షాలు ప‌డ‌ట్లేద‌ని గాడిద మీద ఊరేగిన పెళ్లికొడుకు.. ఇదో వింత సంప్ర‌దాయం!

వ‌ర్షాలు ప‌డ‌ట్లేద‌ని గాడిద మీద ఊరేగిన పెళ్లికొడుకు.. ఇదో వింత సంప్ర‌దాయం!

సాధార‌ణంగా పెళ్లికొడుకును గుర్రంపైన ఊరేగిస్తారు. గుర్రాలు అందుబాటులో లేక‌పోతే కారును అలంక‌రించి అందులో ఊరూరా ఊరేగిస్తారు. కానీ ఈ పెళ్లికొడుకు మాత్రం గాడిద మీద ఊరేగుతున్నాడు. తెల్ల‌దుస్తులు, టోపీ, మెడ‌లో పూల‌మాల వేసుకొని పెళ్లికొడుకులా మెరిసిపోతున్న ఇత‌ను అస‌లు పెళ్లికొడుకే కాదంట‌. ఒక మొక్క చెల్లించుకోవ‌‌డానికి వెళ్తున్నాడు. మొక్కా.. ఇదేం మొక్కు అయినా గాడిద మీద పెళ్లికొడుకు వేషం వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంది అనుకుంటున్నారా? అస‌లు విష‌యం తెలిస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

వ‌ర్షాకాలం వ‌చ్చిన‌ప్ప‌టికీ వాన‌లు ప‌డ‌క‌పోవ‌డంతో అక్క‌డ ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు. రైతులు సైతం వాన‌లు కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఇండోర్ న‌గ‌ర అధ్య‌క్షుడు శివ డింగు ప్ర‌జ‌ల‌కోసం ఏమైనా చేయాల‌నుకొని త‌మ పెద్ద‌ల సంప్ర‌దాయాన్ని అనుస‌రించాల‌నుకున్నాడు. ఆ సంప్ర‌దాయ‌మే వ‌రుడి వేషంతో గాడిద మీద మేళ‌తాళాల‌తో ఊరేగుతూ అక్క‌డ శ్మ‌శాన‌వాటిక‌కు చేరుకోవాలి. అనంత‌రం అక్క‌డ ఉప్పు పోసి మొక్కు తీర్చుకున్నాడు. వర్షాలు బాగా కురవాలని వేడుకున్నాడు. ఈ ప‌ని చేయ‌డం ఇదేం మొద‌టిసారి కాదు. ఇంత‌కు ముందు రెండు, మూడు సార్లు కూడా చేశాడంట‌. అప్పుడు వ‌ర్షాలు ప‌డ‌డంతో ఇప్పుడు కూడా అదే ప‌ద్ధ‌తిని ఫాలో అయ్యాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌‌లోని ఇండోర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాక‌పోతే వీరి సంప్ర‌దాయాల కోసం గాడిద‌ను హింసించ‌డం నేర‌మంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo