మంగళవారం 31 మార్చి 2020
National - Mar 09, 2020 , 18:21:39

ఎలుగుబంటి వేషధారణలో పోలీసులు.. వీడియో

ఎలుగుబంటి వేషధారణలో పోలీసులు.. వీడియో

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ మిత్రిలోని ఐటీబీపీ(ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు) క్యాంపులో కోతుల బెడద ఎక్కువైంది. కోతులను క్యాంప్‌ నుంచి పంపించిన కొద్ది సేపటికే మళ్లీ తిరిగి వస్తున్నాయి. దీంతో కోతుల బెడద నుంచి  తప్పించుకునేందుకు పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఇద్దరు పోలీసులు.. ఎలుగుబంటి వేషధారణలో కోతుల ముందు ప్రత్యక్షమయ్యారు. నిజంగా ఎలుగుబంట్లు వచ్చాయని గ్రహించిన కోతులు.. అక్కడ్నుంచి పరుగు పెట్టాయి. పోలీసులు కూడా ఎలుగుబంటి మాదిరిగానే ప్రవర్తించారు. 


logo
>>>>>>