బుధవారం 08 జూలై 2020
National - Jun 24, 2020 , 13:10:45

ఐటీబీపీకి అతి పెద్ద కరోనా సంరక్షణ కేంద్రం బాధ్యతలు

ఐటీబీపీకి అతి పెద్ద కరోనా సంరక్షణ  కేంద్రం బాధ్యతలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన అతి పెద్ద కరోనా సంరక్షణ  కేంద్రం బాధ్యతలను ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) బుధవారం చేపట్టింది. ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో దవాఖానలు అందుబాటులో లేక కరోనా రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చత్తర్‌పూర్‌లోని రాధా సోమి బియాస్ వద్ద పది వేల పడకల కరోనా సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. దీని నిర్వహణను ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఐటీబీటీ బృందాలతోపాటు వైద్య, పాలనా యంత్రాంగానికి చెందిన అధికారులు బుధవారం ఈ ఆశ్రమానికి చేరుకుని ఏర్పాట్లపై సమీక్షించారు. 


logo