సోమవారం 06 జూలై 2020
National - Jun 17, 2020 , 17:23:38

గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌ల‌పై విదేశాంగ మంత్రుల ఫోన్ చ‌ర్చ‌లు

గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌ల‌పై విదేశాంగ మంత్రుల ఫోన్ చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ: ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో భారత్-చైనా సైనికుల‌ మధ్య తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో ఈ అంశంపై రెండు దేశాల విదేశాంగ మంత్రులు చ‌ర్చించారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ బుధవారం ఫోన్లో చ‌ర్చ‌లు జ‌రిపారు. లఢ‌ఖ్‌లో రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీసిన ప‌రిస్థితులు, స‌మ‌స్య ప‌రిష్కారంపై ఇరువురు మాట్లాడుకున్న‌ట్లు తెలిసింది. 

అయితే, ఘర్షణాత్మక వాతావరణం తలెత్తడానికి కారణమైన వారిని శిక్షించాలని, స‌రిహ‌ద్దుల్లో భారత దళాలను నియంత్రించాలని ఈ సంద‌ర్భంగా వాంగ్‌ఈ భారత విదేశాంగ మంత్రిని డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుందామని కూడా చైనా పేర్కొన్నట్లు సమాచారం. 

లఢ‌ఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికులు మన సైనికులపై రాళ్లు విసిరి, రాడ్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంద‌ర్భంగా మన సైనికులు కూడా వారికి ధీటుగానే బదులిచ్చారు. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. 


logo