శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 18:57:53

భారత్‌, పాక్‌ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నా: ట్రంప్‌

భారత్‌, పాక్‌ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నా: ట్రంప్‌

న్యూఢిల్లీ:  వచ్చే 50 ఏండ్లలో భారత్‌ దిగ్గజంగా నిలుస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీతో బలమైన స్నేహబందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు.  భారత్‌లో అద్భుత ఆతిథ్యం లభించింది.   ఇండియా ఇంతలా అమెరికాను ఎప్పుడూ అభిమానించలేదు.  భారత్‌తో 3 బిలియన్‌ డాలర్ల డిఫెన్స్‌ డీల్ కుదుర్చుకున్నాం.  భారత సీఈవోలతో సమావేశం సంతృప్తినిచ్చింది. ప్రమోటర్లకు భారత్‌ స్వర్గధామం. తాలిబిన్లతో ఒప్పందం గురించి మోదీకి వివరించా. తాలిబన్లతో ఒప్పందం భారత్‌కు కూడా సంతోషమే. భారత్‌ శాంతిని కోరుకుంటోంది. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం ఒక హైప్‌ మాత్రమే. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు నా దృష్టికి వచ్చాయి. కానీ, ఢిల్లీ అల్లర్లపై మోదీతో చర్చించలేదు. సీఏఏపై మోదీతో మాట్లాడలేదు కేవలం మత స్వేచ్ఛపై చర్చించాం. పౌరసత్వం అనేది ఓ దేశ అంతర్గత విషయం అని వివరించారు. 

భారత్‌, పాకిస్థాన్‌తో నాకు సమానంగా సత్సంబంధాలున్నాయి. ప్రతీ అంశాన్ని రెండువైపులా చూడాలి. భారత్‌, పాక్‌ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నా.  ఆర్టికల్‌ 370పై మాట్లాడటానికి ఏమీ లేదు.. అది భారత్‌ అంతర్గత విషయం.  పాక్‌ ఉగ్రదాడులను భారత్‌ ధైర్యంగా ఎదుర్కోగలదు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అవసరమైతే భారత్‌-పాక్‌ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధం. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీరే కారణం. కశ్మీర్‌పై ఇరుదేశాల వాదనలు పూర్తిగా వినాలి. అని ట్రంప్‌ పేర్కొన్నారు. 


logo