గురువారం 26 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 11:22:29

ప్లాస్మా థెరిపీ.. వార్నింగ్ ఇచ్చిన ఐసీఎంఆర్‌

ప్లాస్మా థెరిపీ.. వార్నింగ్ ఇచ్చిన ఐసీఎంఆర్‌

హైద‌రాబాద్‌:  కరోనా వైర‌స్ చికిత్స కోసం.. కొంద‌రు క‌న్వ‌ల్‌సెంట్ ప్లాస్మా థెరిపీ చేయించుకుంటున్నారు.  కోవిడ్ నుంచి కోలుకున్న వారి ర‌క్తాన్ని.. మ‌రో పేషెంట్‌కు ఎక్కించి.. చికిత్స అందించ‌డ‌మే ప్లాస్మా థెరపీ. అయితే ఆ చికిత్స విధానంపై తాజాగా ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ మెడిక‌ల్ రీస‌ర్చ్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది.  ప్లాస్మా థెర‌పీని విచ‌క్ష‌ణార‌హితంగా వాడ‌రాదు అని ఐసీఎంఆర్ త‌న వార్నింగ్‌లో వెల్ల‌డించింది. కేవ‌లం విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న కోవిడ్ రోగుల‌కు మాత్ర‌మే ప్లాస్మా థెర‌పీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ఐసీఎంఆర్ అభిప్రాయ‌ప‌డింది.  ప్లాస్మా థెరిపీ వాడుతున్న విధానంపై ఐసీఎంఆర్ అధ్య‌య‌నం చేప‌ట్టింది. దాని ఆధారంగా ఆ శాఖ ఈ వార్నింగ్ ఇచ్చింది. 39 ప్ర‌భుత్వ‌, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో ప్లాస్మా థెర‌పీ కేసుల‌ను ఐసీఎంఆర్ స్ట‌డీ చేసింది.  అయితే ప్లాస్మా చికిత్స వ‌ల్ల‌.. స్వ‌ల్ప స్థాయి కోవిడ్ రోగుల్లో .. తీవ్ర‌త‌ను త‌గ్గించ‌లేద‌ని గుర్తించారు.